హైదరాబాద్, బతుకమ్మ : న్యూరో విభాగం లో డాక్టర్ రమణేశ్వర్ న్యూరో సర్జన్ ( శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్) అందిస్తున్న వైద్య సేవలను గుర్తించి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్, యుకే లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించింది. డాక్టర్ రమణేశ్వర్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు ను తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గనులు కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ల చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలోని వైద్యులు శస్త్ర చికిత్స నిపుణులకు కృత్రిమ మేధ సాంకేతికతపై అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరమని వారిని శక్తివంతంగా చేయడానికి ఈ సమ్మిట్ నిర్వహించారు. ఏ ఐ ఆవశ్యకత భవిష్యత్తు లో వైద్యరంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుందని ఇది సానుకూల ,ప్రతికూల ప్రభావాలు రెండింటిని కలిగి ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ అవార్డు కార్యక్రమం లో ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ పి.కిషన్, నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి, ఐఎంఏ తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ రామకృష్ణ, వైద్యులు, మేధావులు పాల్గొని డాక్టర్ రమణేశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

