27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ధర్పల్లి పిహెచ్ సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్.అంజన

Must read

📰 Generate e-Paper Clip

ధర్పల్లి, బతుకమ్మ: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్.అంజన తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకస్మికంగా గురువారం సందర్శించారు.  ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఐపి,ఓపి,డెలివరీ రిజిస్టర్ లను పరిశీలించారు.  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.మౌనిక, సి.హెచ్.ఓ జేమ్స్, డిపిఎంఓ శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్స్ దినేష్, సుజాత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది మురళి, సంతోష్, వాజిద్,లత, పూజ,రాము తదితరులు పాల్గొన్నారు.

Dr. Anjana, Deputy DMHO, made a surprise inspection of Dharpalli Ph.C

More articles

Latest article