28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

చందూర్ మండలంలో డబుల్ మర్డర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తనను దూరం పెడుతుందని ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

 

. . . ప్రియురాలి బందువుల చేతిలో ప్రియుడి హతం

 

 వర్ని, బతుకమ్మ:

 

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ మాట్లాడటం లేదని, తనను దూరం పెట్టిందని అనుమానంతో ఆమెను హత్య చేశాడు ప్రియుడు.

 

Double murder in Chandur mandal

 

విషయం తెలిసిన మహిళ కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం పోట్టి గుట్ట తాండాలో జరిగింది. చందూర్ మండలం పోట్టిగుట్ట తాండాకు చెందిన కవిత(30)కు మెడిపల్లి తాండాకు చెందిన వ్యక్తితో ఇది వరకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో కవిత భర్త చనిపోవడంతో అదే తాండాకు చెందిన ఆనంద్ (36) కవిత సహజీవనం చేస్తుంది. ఇటీవల కాలంలో ఇద్దరి మద్య బేదాభిప్రాయాల కారణంగా, తాండాలో పరిస్థితుల నేపథ్యంలో కవిత పుట్టింటికి పోట్టిగుట్ట తాండాకు వచ్చి పిల్లలతో సహా నివసిస్తుంది. ఆనంద్ ఫోన్ చేసిన స్పందించకపోవడం తో తనను దూరం పెట్టిందనే అనుమానంతో సోమవారం పోట్టిగుట్ట తాండాకు వచ్చి గొడవ పడ్డారు. అక్కడే ఉన్న పారతో కవిత తలపై మొదడంతో తీవ్ర రక్త స్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

 

Double murder in Chandur mandal

 

విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్ధులు ఆనంద్ ను పట్టుకుని తీవ్రంగా చితక బాదారు. ఆ దెబ్బలకు ఆనంద్ తీవ్ర గాయాలతో పడిపోయాడు. విషయం తెలిసిన వర్ని పోలిసులు ఆనంద్ ను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ మేరకు వర్ని పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

 

More articles

Latest article