28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్

భీమ్ గల్, బతుకమ్మ : మున్సిపల్ పట్టణ పరిధిలో గల హోటల్లు, బేకిరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రజారోగ్యాలతో చెలగాటం ఆడొద్దని భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ నిర్వాహకులకు అల్టీమెటం జారీ చేశారు. తాను ఉద్యోగ భాద్యతలు చేపట్టిన తర్వాత సోమవారం పట్టణం లోని పలు హోటల్స్, బేకిర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఆయన తన సానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ కల్తీ ఆహారాలు, కుళ్ళిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన ఆహార వస్తువులను కస్టమర్లకు అమ్ముతు మాకు పట్టుబడితే 2019 మున్సిపల్ చట్టం ప్రకారం ఫైన్ తో పాటు క్రిమినల్ కేసులు చేస్తామని షాప్ ల నిర్వాహకులకు హెచ్చరించారు.హోటల్స్, బేకిర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహణ స్థలాల వద్ద కూడా పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి ఫిర్యాదులు అందిన ఎవ్వరిని ఉపేక్షించిదేలేదని ఆయన స్పష్టం చేశారు.

More articles

Latest article