29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: దళారులకు ధాన్యం అమ్మిమోసపోవద్దని రైతులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్ తోపాటు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజితావెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, డైరెక్టర్ నాగం గోపీక్రిష్ణ, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, ఐకేపీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article