29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అడవులను నరికి జైలు పాలు కావద్దు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి ఎప్ డిఓ రామకృష్ణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ: పొడు భూముల కోసం అడవులు నరికి జైలు పాలు కావద్దని కామారెడ్డి ఎప్ డిఓ రామకృష్ణ హెచ్చారించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో లక్ష్మాపూర్ బీట్ పరిధిలోని హజీపూర్ సడక్ తండాకు చెందిన కొందరు ప్రభుత్వలు ఎలాగైనా ఫారెస్ట్ భూముల హక్కు పత్రాలు ఇస్తారని భావించి ఫారెస్ట్ బీట్ అధికారులు, సెక్షన్ అధికారుల మాయమాటలను నమ్మి అడవి భూములను నరుకుతున్నారు అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ డి ఓ రామకృష్ణ గత రెండు రోజుల క్రితం హజీపూర్ సడక్ తండా సమీపంలోని అడవుల నరికివేత ప్రాంతాన్ని సంధర్శించారు. గురువారం ఎల్లారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ 13డిసెంబర్ 2005 ఆటవి ప్రాంతం లోపల సాగు చేస్తు కబ్జాలో ఉన్న గిరిజనుల కు మాత్రమే పోడు భూముల పట్టాలు అందిస్తామన్నారు.కానీ కొత్తగా అడవులను నరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. నరికివేతను గురైన అడవిని భూములను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. అడవి భూములు నరికివేతకు కారణమైన ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అలాగే డివిజన్ పరిధిలో ఆర్డిఓ, డిఎస్పి లతో సబ్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గ్రామాలలో గ్రామపంచాయతీ సెక్రటరీలకు నాటిన మొక్కల పూర్తి రక్షణ బాధ్యతలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మా రక్షణ అని కాకుండా మన రక్షణ లాగా అడవులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి రేంజ్ అధికారి ఓంకార్ నాయక్, సెక్షన్ అధికారి శ్రీనివాస్ నాయక్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article