- ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువత రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దని, చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను చేరుకోవాలేని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నగరంలోని గంగాస్తాన్ పేస్ -1లోని యువి హోటల్ మేనేజ్ మెంట్ సౌత్ క్యాంపస్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ స్వార్థం కోసం రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో తాము మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు,ఎంపీల అవుతారని తర్వాత యువత గురించి పట్టించుకోరన్నారు. తాము మాత్రం ఇతర రాజకీయ పదవుల్లో ఉంటామని యువత మాత్రం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులకు గుర్తుకు వచ్చి వారిని పావులుగా వాడుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. మన స్వార్థం కోసం యువతను రెచ్చగొట్టి రోడ్లపై రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసులు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతినా అని ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలని ఆయన అన్నారు. యువి హోటల్ రాజకీయ నాయకులు మేనేజ్ మెంట్ నిర్వాహకులు సృజన్ కుమార్ మంచి ఆలోచన చేశారని గ్రామీణ స్థాయి యువతకు హోటల్ మేనేజ్ మెంట్ ద్వారా విదేశాల్లో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చన్నారు. హోటల్ మేనేజ్ మెంట్ స్థాపించడం అభినందనీయమని అన్నారు. యువత చెడు మార్గాలకు పోకుండా డ్రగ్స్, గంజాయి, మద్యానికి దూరంగా ఉండి చదువు మీద దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను హోటల్ మేనేజ్ మెంట్ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
