రామారెడ్డి, బతుకమ్మ : చెస్ నెట్ వర్క్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సుధీర్ కొడాటి కెనడా ఆధ్వర్యంలో రామారెడ్డి మండలంలో అన్ని పాఠశాలలకు చెస్ బోర్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ లోని అన్ని పాఠశాలలకు చెస్ బోర్డ్స్ అందించి చెస్ సంస్కృతిని వ్యాప్తి చేయాలని దీని ద్వారా విద్యార్థులలో ఉన్న చెడు లక్షణాలు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా అదేవిధంగా సోషల్ మీడియా కు అలవాటు పడకుండా నివారించవచ్చునని అన్నారు. చెస్ ఆట ను తెలంగాణలోని ప్రతి పాఠశాలలో విద్యార్థుల చేత ఆడించాలని ఈ చెస్ బోర్డ్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

