ఆర్మూర్, బతుకమ్మ : దివ్యాంగులైన దివ్యమైన ప్రేమ చూపిన చర్చ సభ్యులు ఆర్మూర్ లోని చెవిటి మూగ పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్లోని ముషీరాబాద్ సి ఎస్ ఐ చర్చి సభ్యులు దివ్యమైన ప్రేమను కనబరిచారు చర్చి సభ్యులు పాఠశాలలను స్పందించి విద్యార్థుల అవసరం తెలుసుకున్నారు. వెంటనే విద్యార్థులకు 80 వేల రూపాయలతో రెండు ఎల్ ఈ డి లను 15 ఫ్యాన్ లను 20 కుర్చీలను ఒక వాటర్ ప్యూరిఫై ను విరాళంగా అందించారు, అనంతరం ప్రతి విద్యార్థికి అవసరమైన ఒక జత యూనిఫామ్, దుప్పటి, టవాల్, పల్లెం, గ్లాసులను అందించారు. తమ చర్చి ఆధ్వర్యంలో మరింత సమయం చేస్తామని ముషీరాబాద్ చర్చి ఫాదర్ రెవరెండ్ విన్స్టన్ అన్నారు. పాఠశాలను స్పందించి విద్యార్థులకు భారీగా విరాళం అందించిన చర్చ సభ్యులను ఆర్మూర్ చర్చి ఫాదర్ రెవరెండ్ మన్నె శ్రీనివాస్ అభినందించారు. పాఠశాలకు సాయం చేసిన వారికి పాఠశాల మేనేజర్ సువర్ణ కిరిటీ కుమారి , ప్రిన్సిపల్ ఎస్ శాంతమూర్తి, వార్డెన్లు, మా కిదర్, ఇస్తర్ కిషన్ లు దిలీప్, సుధా, నిర్మల తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
