
. మూడు వార్డుల్లో ఆరుగురిపై దాడి
. మహిళ పరిస్థితి విషమం, హైదరాబాద్ కు తరలింపు
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణ ప్రజలను వీధి కుక్కలు బెంబేలెత్తించాయి. బుధవారం ఉదయం పట్ణంలో స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశాయి. పట్టణంలోని 45,46,47, 31 వార్డుల్లో పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సత్తెవ్వ అనే మహిళకు తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా మారింది. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

