25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మేకల మంద పై కుక్కల దాడి

Must read

📰 Generate e-Paper Clip

. . . 25 జీవాలు మృతి

భిక్కనూరు, బతుకమ్మ:

గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 25 జీవాలు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భిక్కనూరు నుండి కాచాపూర్ వెళ్లే రోడ్డులో కె జి ఎల్ సమీపంలో మూడు నెలల క్రితం ఓన్నాసుల బీరయ్య మేకల మందను పెట్టాడు. వారం రోజుల క్రితం కుక్కల దాడిలో 28 జీవాలు మృతిచెందగా మంగళవారం తెల్లవారుజామున మరో 25 జీవాలు మృతి చెందడంతో గొర్రె కాపరులు బీరయ్య సాయిలు రాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో కోళ్ల ఫారం లు ఉండడంతో చనిపోయిన కోడి పిల్లలను పారి వేయడం ద్వారా రుచి మరిగిన ఊర కుక్కలు మందపై దాడి చేస్తూ జీవాలను కరవడంతో మృతి చెందాయన్నారు  కోళ్ల ఫారంల యాజమాన్యం కోళ్లను పారవేయకుండా చూడాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. సుమారు 2 లక్షల రూపాయల నష్టం జరగిందని, నెల రోజుల్లో 5 లక్షల నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dog attack on herd of goats

More articles

Latest article