వరద బాధితులకు డీఎల్ఎస్ఏ సాయం
కామారెడ్డి, బతుకమ్మ : ఇటీవల అకాల వర్షాలు, వరదల కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎస్ఎస్ఏ) ముందుకు వచ్చింది. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ సూర సుమలత మాట్లాడుతూ "ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పారా లీగల్ వాలంటీర్ల సహకారంతో తాత్కాలిక భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు మా అథారిటీ కృషి...