27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పీడీఎస్ యూ  రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన జిల్లా ప్రతినిధులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  వరంగల్ జిల్లా కేంద్రంలో జరగబోయే పీడీఎస్ యూ  రాష్ట్ర మహాసభలకు నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు తరలివెళ్లారు.  పీడీఎస్ యూ  నిర్మాత జంపాలా చంద్రశేఖర ప్రసాద్ నిజామాబాద్ నగరంలో విద్యను అభ్యసించిన మల్టీ పర్పస్ స్కూల్ ( ప్రస్తుత ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల) వద్ద పూర్వ  పీడీఎస్ యూ  నాయకులు పరుచూరి శ్రీధర్, జి.రమేష్, పిట్ల సరిత, ఎల్ బి రవి, ఆకుల అరుణ,సత్యం లు బిగిపిడికిలి జెండా ఊపి ప్రారంభించారు..      ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఉద్యమించాడని , జిల్లాలో సంక్షేమ హాస్టల్స్, తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల కోసం పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఉద్యమించి సాధించిందన్నారు. అమరవీరుల స్ఫూర్తితో పోరాటం నిర్వహించాలని, మహాసభల్లో విద్యారంగా సమస్యలపై చర్చలలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పీడీఎస్ యూ  జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు అక్షయ్,గౌతం రాజ్, నిజామాబాద్ నగర అధ్యక్ష కార్యదర్శులు పవన్,సాయి కిరణ్
జిల్లా కమిటీ సభ్యులు మనోజ్,లతో పాటు జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు తరలి వెళ్లారు.

More articles

Latest article