27న జిల్లాస్థాయి యువజన పోటీలు
కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న కామారెడ్డి జిల్లా స్థాయి యువజన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కళాభారతి ఆడిటోరియంలో పోటీలు నిర్వహిస్తామని, సాంస్కృతిక విభాగంలో జానపద నృత్యం(బృందం), జానపద నృత్యం (వ్యక్తిగత/ సోలో), జానపద గీతాలు ( బృందం), (వ్యక్తిగత/ సోలో), సైన్స్ మేళా, హస్తకళ, వస్రకళ, ఆర్గో ఉత్పత్తుల పై కళాభారతి ఆడిటోరియంలో పోటీలు ఉంటాయని చెప్పారు. కథ రచన, పెయింటింగ్,( డిక్లరేషన్/...