బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండల కేంద్రంలోని ‘భూదేవి ఇండోర్ స్టేడియం’లో ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్ షిప్ ఉమెన్స్ (బాలికల) నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేయుటకై సోమవారం రోజు ఉదయం సెలెక్షన్స్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు శ్రవణ్ రెడ్డి హాజరైనట్లు పేర్కొన్నారు. 20 మంది క్రీడాకారిణిల నుంచి 12 మందిని ఫైనల్ చేస్తామన్నారు. హైదరాబాద్ లో డిసెంబర్ 7 నుండి 10వ తేదీ వరకు జరిగే 71వ సీనియర్ కబడ్డీ ఛాంపియన్ షిప్ లో ఎంపికైన జిల్లా జట్టు పాల్గొంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఊషూ క్రీడా జిల్లా అధ్యక్షులు ఏలేటి గంగాధర్, పీడీలు రాజ్ కుమార్, ప్రసాద్, మూన్ రాజ్, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు అంజయ్య, టి.సాయన్న, జి.గంగారాం, మోతె గంగారెడ్డి, సంజీవ్ థామస్, సాయిలు, రాకేష్, కనకయ్య, ముస్కు శ్రీను తదితరులు పాల్గొన్నారు..
