కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు) లో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రజేష్ చంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

