నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ చతుర్థి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని,గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలషించారు. పర్యావరణానికి హాని కలుగని విధంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలని,పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

