25.5 C
Hyderabad

జాతీయ లోక అదాలత్ లో 6649 కేసులు రాజీపడి పరిష్కారం

6,649 cases settled amicably at the National Lok Adalat.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విజయవంతం చేసిన అధికారులను,సిబ్బందిని అభినందించిన సీపీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న  6649 కేసులు రాజీపడి పరిష్కారమైనట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. బిఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ 462 కేసులు, సైబర్ క్రైం 71 కేసులు, ఈపెట్టి 3109, డీడీ, ఎంవి యాక్టు 3007 మొత్తం 6649 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్ , వివిధ కేసులలో రాజీ మార్గం జరిగిందన్నారు.  జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, కోర్టు సిబ్బందిని అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని,అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు.  ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆద్వర్యంలో ఏడు కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డీ4సీ ని ఏర్పాటు చేసి డిఎస్పి స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాదు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ నందు 71 సైబర్ క్రైమ్ కేసులలో 24,02,552 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి  పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చన్నారు.

More articles

Latest article