26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలం లోని జంగంపల్లి గ్రామంలోని పల్లె దావఖానను మంగళవారం  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మితిగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపి, ఏఎన్సీ చెకప్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎక్కడైనా డెంగ్యూ వంటి వ్యాధులు నిర్ధారణ అయిన వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహించే రోజువారి కార్యక్రమాలను రిజిస్టర్లు లో నమోదు చేయడంతో పాటు వాటి ధ్రువీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం కాకుండా చూడాలని ఇసుక మరియు మొరం కొరకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ డిప్యూటీ విద్యాధికారి ప్రభు కిరణ్ తదితరులు ఉన్నారు.

District Collector conducts surprise inspection of village hospital

More articles

Latest article