29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ : విదేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభూమిపై మమకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం త్రాగునీటి వాటర్ ప్లాంట్, సైన్స్, గణిత శాస్త్రాలకు సంబంధించిన సామాగ్రిని అందజేసి హైదరాబాద్ కు చెందిన ముత్యపు సందీప్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎల్. శ్రీనివాస్ అమెరికా దేశంలోని మిన్నే సోట ప్రాంతంలో స్థిరపడిన తన మిత్రుడైన ముత్యపు సందీప్ కుమార్ కు తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం అందజేయాలని కోరగా, అమెరికాలోని మిన్నెసోట ప్రాంత తెలంగాణ అసోసియేషన్ (మాటా) వారి సహాయంతో మాటా డైరెక్టర్ ముత్యపు సందీప్ కుమార్ లక్ష రూపాయలకు పైగా వితరణ చేసి విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీటి వాటర్ ప్లాంట్, సైన్స్, మ్యాథ్స్ మెటీరియల్ తో పాటు గ్రంథాలయ పుస్తకాలు, బీరువా ఇతర వస్తువులను వితరణ చేసినట్లు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. దీంతో శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన త్రాగునీటి వాటర్ ప్లాంట్ ను స్థానిక ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల్లో ఉండి మన ప్రాంతం విద్యార్థుల కోసం ఇంతటి సహాయం చేయడం హర్షించదగ్గ విషయమని, ముత్యపు సందీప్ కుమార్ తన మానవత్వం చాటుకుని సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు.  ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం మాటా సంస్థకు, మాటా డైరెక్టర్ సందీప్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి, మాల్తుమ్మెద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రాజు, ఉపాధ్యాయులు కవిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Distribution of water plant to school

More articles

Latest article