27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల:  ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ మరియు కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ దేవేందర్ సంయుక్తంగా సుమారు 50 మంది విద్యార్థులకు  క్రీడా దుస్తులను విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం తన వంతుగా బాధ్యత తీసుకొని సహాయ సహకారాలు అందిస్తానని, స్కూల్ విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాలకు, స్కూల్ ఉపాధ్యాయులకు, మంచి పేరు తేవాలని, ఏర్గట్ల పాఠశాల పేరును జిల్లా వ్యాప్తంగా గుర్తింపు తేవాలని విద్యార్థులతో అన్నారు. కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఏదైనా అవసరాలు ఉంటే తప్పకుండా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేసిన శివన్నోళ్ళ శివకుమార్,దేవేందర్ కి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కొమరగిరి కృష్ణాచారి, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article