అర్థాంతంగా ముగుస్తున్న గ్రామ సభలు
బతుకమ్మ,వేల్పూర్ :-మండలం లోని పచ్చల నడుకుడ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ సందర్భంగా లబ్ధి పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు వచ్చాయని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. భారీ స్థాయిలో హాజరైన గ్రామ ప్రజలు అధికారులను నిలదీస్తూ అడుగడుగున నిరసనలు తెలిపి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సభలో ఆవేదన వ్యక్తం చేసారు.
