ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామానికి చెందిన ఏనుగందుల ఉమ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయాన్నిస్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆమె వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార ఆ పేద కుటుంబానికి రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు చేయించారు.చెక్కు మంజూరుకి సహకరించిన ముత్యాల సునీల్ కుమార్ కి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
