27.5 C
Hyderabad
Friday, July 31, 2026

దత్తత గ్రామం లో లింగాకర్షక బుట్టల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :

 

ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం రుద్రూరు శాస్త్రవేత్తల బృందం దత్తత గ్రామం ఐనటువంటి హున్సా లోని వరి, శనగ పంటలను సందర్శించారు. వరి సాగు చేస్తున్నటు వంటి 10 మంది రైతులకు కాండం తొలిచే పురుగు ఉదృతి గమనించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడే లింగాకర్షక బుట్టలను పంపిణీ చేశారు. ఈ లింగాకర్షణ బుట్టలను పొలంలో నాట్లు వేసిన 15 రోజుల నుండి ఒక ఎకరానికి 5-6 పంట కన్నా ఒక అడుగు ఎత్తులో అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించవచ్చని సూచించారు. బుట్టలో అమర్చుకున్న రబ్బర్ ల్యూర్ ని 30-40 రోజులకు ఒకసారి మార్చుకోవాలని తెలిపారు. ఒక రోజులో ఒక లింగాకర్షణ బుట్టలో 5- 6 పురుగులు కనీసం 3 రోజుల పాటు పడినపుడు మాత్రమే రసాయనాలను ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామం ఇంచార్జ్ డాక్టర్ రమ్య రాథోడ్, సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సమత పరమేశ్వరి, కీటక శాస్త్రవేత్త ఎం సాయిచరణ్, తెగుళ్ల విభాగానికి చెందిన శాస్త్రవేత్త డా. చంద్రకళ తో పాటు గ్రామ సర్పంచ్ ఎమ్. శివకుమార్, ఉపసర్పంచ్ టి. నగేష్,  ఏఎంసీ చైర్మన్ సి. హెచ్. శంకర్, సొసైటీ ప్రెసిడెంట్ ఎమ్. శంకర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

 

Distribution of sex appeal baskets in the adopted village
Distribution of sex appeal baskets in the adopted village
Distribution of sex appeal baskets in the adopted village
Distribution of sex appeal baskets in the adopted village

More articles

Latest article