దత్తత గ్రామం లో లింగాకర్షక బుట్టల పంపిణీ
బోధన్, బతుకమ్మ : ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం రుద్రూరు శాస్త్రవేత్తల బృందం దత్తత గ్రామం ఐనటువంటి హున్సా లోని వరి, శనగ పంటలను సందర్శించారు. వరి సాగు చేస్తున్నటు వంటి 10 మంది రైతులకు కాండం తొలిచే పురుగు ఉదృతి గమనించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడే లింగాకర్షక బుట్టలను పంపిణీ చేశారు. ఈ లింగాకర్షణ బుట్టలను పొలంలో నాట్లు వేసిన 15 రోజుల నుండి ఒక ఎకరానికి 5-6 పంట కన్నా ఒక అడుగు ఎత్తులో అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించవచ్చని...