24.2 C
Hyderabad

లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ. బోధన్ : బోధన్ పట్టణంలో నూతనంగా అర్హత పొందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి లబ్ధిదారుల చేతికి స్వయంగా రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ప్రభుత్వం సామాజిక న్యాయం పట్ల కట్టుబడి ఉందని, ప్రతి అర్హత కలిగిన  పేద కుటుంబానికి రేషన్ కార్డు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు ద్వారా మరిన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

More articles

Latest article