కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలం లోని హాసకొత్తూర్ జడ్పిహెచ్ఎస్ లో మంగళవారం విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. అదే పాఠశాలలో బయోలాజీ టీచర్ జయంతి తన సొంత డబ్బులతో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. తన తండ్రి కీ. శే.తిరునగరి వేణు గోపాలస్వామి స్మారాకార్థం ఈ బుక్కులు, పెన్నులను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్ బూస కృష్ణ కుమార్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
