విద్యుత్ బల్బుల వితరణ
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ దయాల లక్ష్మణ్ గ్రామానికి సరిపడా విద్యుత్ బల్బులను సొంత ఖర్చులతో గ్రామ సర్పంచ్ కొండల్వాడి శంకర్, గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన ఊరి కోసం తన వంతు సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో విద్యుత్ బల్బులను అందజేయడం జరిగిందని అన్నారు. బహుకరించిన విద్యుత్ బల్బులను గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు వీధి వీధి తిరుగుతూ కరెంట్ స్తంభాలకు అమర్చారు. ఈ...