మాక్లుర్, బతుకమ్మ :
మాక్లుర్ మండలంలోని మాదాపూర్ లో మౌత్ డిసీజ్ నివారణ కోసం పశు వైద్యులు డాక్టర్ డా.ఉమామా సాహెర్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువులకు తీవ్రమైన అంటు వ్యాధి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నుండి రక్షించేందుకు ఈ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెగారి రవి కళ్యాణి, గంగాధర్, పుష్ప, సికిందర్, గోపాల్ మిత్ర సుధీర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.