28.8 C
Hyderabad

చేప పిల్లల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

లింగంపేట, బతుకమ్మ :  మండల కేంద్రంలో గురువారం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో నరేశ్ ప్రారంభించారు.
మండలంలో 63 చెరువుల గాను 16 లక్షల 95 వేల 690 చేప పిల్లలను ఆయా గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పంపిణీ చేశారు ఈసందర్బంగా  జిల్లా డైరెక్టర్ బెస్త సాయిలు మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సంఘాలు బలోపేతం కావాలని సూచించారు.  ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలు పంపిణీ ని  మత్స్యకారులు  సద్వినియోగం చేసుకోవాలన్నారు.  చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేసిన తర్వాత ఎప్పటికప్పుడు సంఘాల సభ్యులు చేప పిల్లలను పర్యవేక్షించాలన్నారు.  చేపలు పెంచే బాధ్యత సంఘాలదేన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార ఫీల్డ్ ఆఫీసర్ అక్తర్ సురేష్ జయరాజు,  తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు సాయికుమార్, శేఖర్, శ్రీను, పర్వయ్య, ఆయా గ్రామాల మత్స్యకారులు ఉన్నారు.

More articles

Latest article