చేప పిల్లల పంపిణీ
లింగంపేట, బతుకమ్మ : మండల కేంద్రంలో గురువారం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో నరేశ్ ప్రారంభించారు. మండలంలో 63 చెరువుల గాను 16 లక్షల 95 వేల 690 చేప పిల్లలను ఆయా గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పంపిణీ చేశారు ఈసందర్బంగా జిల్లా డైరెక్టర్ బెస్త సాయిలు మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సంఘాలు బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలు పంపిణీ ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెరువుల్లో చేప పిల్లలు విడుదల...