నిజామాబాద్ సిటీ బతుకమ్మ : సిఎంఆర్ ఎఫ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో తన తరపున డిమాండ్ చేస్తానని బాధితులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. నగరం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోమంగళవారం నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ధ్వరా 84మందికి 25,65,000రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలే డిమాండ్ చేస్తానని తెలియజేసారు. గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచిన చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలలో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి లబ్ధిదారులు అందరు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
