24.1 C
Hyderabad
Monday, August 3, 2026

26న మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : వినాయక చవితిని పురస్కరించుకొని ఈనెల 26న ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు  కే6 ఛానల్ వ్యవస్థాపకులు సామ జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల జిల్లా పరిషత్ స్కూల్ ఎదురుగా ఉన్న కే6 కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తామన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్, ఆర్మూర్ కు చెందిన అవార్డు గ్రహీత గురుస్వామి ప్రముఖ పండితులు గణపతి ఉపాసకులు  బల్యపల్లి సుబ్బారావు హాజరుకానున్నారని పేర్కొన్నారు. గత 13 సంవత్సరాలు గా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని ,ఈఏడాది 25 వేల మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

More articles

Latest article