. . . కడియం శ్రీహరి దానం నాగేందర్ లకు ఊరట
. . . బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ లను కొట్టివేసిన స్పీకర్
హైదరాబాద్, బతుకమ్మ :
బిఆర్ ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. ఈ మేరకు బుధవారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి లు స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అనర్హత పిటిషన్ లపై అందరి వాంగ్మూలాలను స్వీకరించిన అనంతరం తీర్పును బుధవారానికి రిజర్వ్ చేశారు. రెండు పిటిషన్లపై స్టేట్మెంట్ల ప్రకారం వారు ఇద్దరు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని దానిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్ నిర్ణయం తొ యిప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పదిమంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. బీఆర్ఎస్ అనుకున్నట్టు రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. అయితే సుప్రీంకోర్టులో కడియం శ్రీహరి ల ఫై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో గురువారం విచారణ జరగనుంది.

