26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉట్నూర్ లావణ్యను ఉద్యోగం నుండి తొలగించడం అక్రమం

Must read

📰 Generate e-Paper Clip

తక్షణo విధుల్లోకి తీసుకోవాలి

 ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

నిజామాబాద్  సిటీ,  బతుకమ్మ : గత నెలలో డీఎస్సీ ద్వారా ఎంపికై దుబ్బాక మండలం ధర్పల్లి ప్రైమరీ స్కూల్ వడ్డెర కాలనీలో పనిచేస్తున్న ఉట్నూరు లావణ్య అనే ఎస్ జి టి ఉపాధ్యాయురాలి నియామకం అక్రమమైనదని ఆమెను ఉద్యోగం నుండి నెల రోజులు పని చేసిన తర్వాత తొలగించడం అన్యాయమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. ఆమె స్థానంలో భార్గవి అనే మహిళకు ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయడం అక్రమమైనదని, ఎందుకంటే భార్గవి  సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో పాల్గొనలేదని తెలిపారు. అందుకే సెలక్షన్ లిస్టులో ఆమె పేరుని ఉన్నతాధికారుల ఆమోదానికి పంపబడలేదని, ఉన్నతాధికారుల ఆమోదం పొందిన జాబితాలో కూడా భార్గవి ఎంపిక  కాలేదని  తెలిపారు.  కానీ జిల్లా విద్యాశాఖలో కొందరు  కాసులకు కక్కుర్తి పడి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరుకాని భార్గవికి ఉద్యోగం కట్టబెట్టేందుకు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెరిఫికేషన్కు హాజరు కాని భార్గవికి వెరిఫికేషన్కు హాజరైనట్టు తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొందరు చక్రం తిప్పి మొత్తానికి వెరిఫికేషన్ కు హాజరైనట్టుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పొరపాటు వల్ల ఉద్యోగ అవకాశం దక్కలేదని ఆమె మెరిట్ 125 అయినందున 257 మెరిట్ ద్వారా ఉద్యోగం పొందిన ఉట్నూర్ లావణ్యను ఉద్యోగం నుండి తొలగించడం అన్యాయం అని అన్నారు. వెరిఫికేషన్ కు హాజరుకాని భార్గవికి హాజరైనట్లుగా ఫైలును ప్రాసెస్ చేసిన అవినీతిపరులను, అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి తక్షణమే సస్పెండ్ చేసి  సమగ్ర విచారణ జరపాలని  డిమాంద్ చేశారు. నిబంధనల ప్రకారం ఎంపికైన ఉట్నూర్ లావణ్యకు తక్షణమే ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని కోరారు.

More articles

Latest article