29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐకెపి ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ పై చర్చ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ బిచ్కుంద పరిధిలో అడిషనల్ డి ఆర్ డి ఓ మరియు సెర్ఫ్ ప్రతినిధులు, బిఓడి సభ్యులతో సోయా ప్రాసెసింగ్ నిమిత్తం చర్చించడం జరిగిందని బిచ్కుంద ఐకెపి ఎపిఎం రవీందర్ తెలియజేశారు. అనంతరం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిచ్కుంద లో రైతులతో కలిసి సోయా ప్రాసెసింగ్పై చర్చించడం సోయాను స్వయంగా సభ్యులందరితో కలిసి పరిశీలించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, సర్ఫ్ ప్రతినిధులు, డిపిఎం మార్కెటింగ్ సాయిలు, సీసీలు మరియు అకౌంటెంట్ పాల్గొన్నారు.

Discussion on food processing unit under the auspices of IKP

More articles

Latest article