24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విధుల్లో క్రమశిక్షణ, నిబద్దత పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర
  • రాజంపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

రాజంపేట్, బతుకమ్మ : రాజంపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా మొదట రోల్ కాల్ ను పరిశీలించి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించి సిబ్బంది నిబద్దత, క్రమ శిక్షణను పెంపొందిచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలక న్యాయం చేయాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు.

More articles

Latest article