నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చేయూత పింఛన్ల పెంపు కొరకు రేవంత్ రెడ్డి సర్కార్ పై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వం లో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్నామని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల నాయకుల తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులతో గురువారం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, అన్ని రకాల చేయూత పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 8న వేలాది మంది చేయుత పించన్ దారులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా ను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12న చేయూత పింఛన్దారులతో మండలాల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయాలు ముట్టడి, ఈ నెల 21నుండి 26 తేది వరకు అన్ని గ్రామ పంచాయతీలలో చేయుత ఫించన్ దారుల నిరసన దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 27 న జిల్లా కేంద్రాలనుండి హైదరాబాద్ కు వెల్లె రహదారుల అన్ని చేయూత పించన్దారులతో దిబ్బంధం చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లస్సింగారి భూమయ్య మాదిగ, హెచ్ పి జిల్లా ఉపాధ్యక్షులు సలీం, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్ మాదిగ, ఆకారం రమేష్ మాదిగ, నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు పెద్దింటి మహేష్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకుడు యమునా, సత్య అక్క, జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు రోడ్డ సప్న, వీహెచ్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, దేశాయి ప్రశాంత్, కిన్నెర మోహన్, యాదవ్ రావ్, మారుతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

