29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ మధుమేహం నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డయాబెటిస్ వ్యాధి నిర్ధారణ, అవగాహన కార్యక్రమాన్ని ముబారక్ నగర్ పరిధిలోని ఆలంబన వృద్ధాశ్రమంలో నిర్వహించినట్లు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సామ్రాట్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికిత్స కన్నా నివారణ  మిన్న వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుని దానికంటే రాకమందు మధుమేహం వ్యాధి రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యమన్నారు. జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ కనీసం ప్రతిరోజు 30 నిమిషాలు వారానికి 150 నిమిషాలు నడక మంచిదన్నారు. మధుమేహం టైపు వన్, టైపు టు, గర్భిణీ స్త్రీలలో వచ్చేది, కాకుండా కొత్తగా ఇంకా రెండు రకాలుగా ప్రభలుతున్నదన్నారు. ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి కాకపోవడం, ఉత్పత్తి అయిన ఇన్సులిన్ శరీరo సరిపడా ఉపయోగించుకోకపోవడం, లాంటిది జరుగుతుందని తెలియజేశారు. కుటుంబంలో ఒకరికి వ్యాధి నిర్ధారణ అయితే వారి ద్వారా వంశపారంపర్యంగా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందన్నారు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఉండడం, అధికంగా చక్కెర పదార్థాలను భుజించడం, ఊబకాయం కలిగి ఉండడం, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం, బిపి అధికంగా ఉండడం ఇలాంటివి మధుమేహానికి దారితీసే పరిస్థితులన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తరచుగా వైద్య పరీక్షలు చేసుకుంటూ, మధుమేహంపై అవగాహనతో,జీవనశైలి మార్పులతో జీవించాలన్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని 47  మంది వృద్ధులకు వైద్య పరీక్షలు,మధుమేహం నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించడం జరిగిందని తెలియజేశారు. వృద్ధాశ్రమంలోని వ్యాధిగ్రస్తులు అందరూ వారి వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచార్యులను తెలియజేసే దాటాను ప్రత్యేకoగా చిన్న  బుక్కులో నమోదు చేయించాలన్నారు. ఈ సందర్భంగా 47 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలను నిజామాబాద్ గ్రామీణ మండలం తిరుమన్ పల్లి వైద్యాధికారి డాక్టర్ స్నేహ, ముబారక్ నగర్ఎమ్మెల్ హెచ్ పి డాక్టర్ అంకిత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎస్ టి ఎస్ ఊహ శ్రీ, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఎన్సిడి డిసి వెంకటేష్, ఆరోగ్య పర్యవేక్షకుడు మధుకర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article