నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ లో గురువారం పెన్షనర్ల ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండుగా విభజిస్తూ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని దీని మూలంగా పాత పెన్షనర్లకు డిఏ గాని, పెన్షన్ రివిజన్ గాని జరగదని, పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేయటం తగదని గురువారం జరిగిన దేశవ్యాప్త కార్మిక, ప్రజాసంఘాల సార్వత్రిక సమ్మెలో పెన్షనర్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీనియర్ సిటిజనులకు రైల్వేలో ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు రూ. 9000 పెన్షన్ గా నిర్ధారించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, తదితర డిమాండ్లతో వారు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో పెన్షనర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, జిల్లా నాయకులు ప్రసాదరావు, రాధా కిషన్, సాంబశివరావు, లావు వీరయ్య, పుష్ప పల్లి, దీన సుజన, ఆర్మూర్ శంకర్, పురుషోత్తం, బాలయ్య, బట్టి గంగాధర్, సిర్ప లింగయ్య, లక్ష్మణ్, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
