డిచ్ పల్లి, బతుకమ్మ : హిమ్మత్ లాల్, మణిలాల్ టొబాకో పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిచ్ పల్లి మండల కేంద్రంలోని బీడీ కంపెనీ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న లు మాట్లాడుతూ హిమ్మత్ లాల్ బీడీ కంపెనీ 0యాజమాన్యం కార్మికులపై వివక్ష చూపుతుందన్నారు. కార్మికులకు సరిపడా పని దినాలను, నాణ్యమైన తునికాకు, ధారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినెల కూలీ చెల్లింపులు జరగడం లేదన్నారు. వెంటనే పనిదినాలు పెంచాలని, అవసరమైనంత నాణ్యమైన తునికాకు, అందివ్వాలని, మూడు నెలల కూలీబకాయిలు ఇప్పించాలని, కార్మికులకు లాగ్ బుక్స్, వేజ్ స్లిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ మేనేజర్ నాయకులతో చర్చలు జరిపి తక్షణమే పనిదినాలను పెంచుతామని, రెండు నెలల బకాయిలు వెంటనే ఇస్తామని, మిగతా డిమాండ్లు యాజమాన్యంతో చర్చించి, నెలరోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్, జిల్లా నాయకులు పి.సాయిరెడ్డి, నాయకులు సాయిబాబా, లక్ష్మి, సుజాత, గంగామణి, అనసూయ, జమున, శ్యామల రాధిక తదితరులు మరియు బీడీ కార్మికులు పాల్గొన్నారు.

