హిమ్మత్ లాల్ బీడీ కంపెనీ కార్యాలయం ముందు ధర్నా

డిచ్ పల్లి, బతుకమ్మ :  హిమ్మత్ లాల్, మణిలాల్ టొబాకో పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిచ్ పల్లి మండల కేంద్రంలోని  బీడీ కంపెనీ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో  బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న లు మాట్లాడుతూ హిమ్మత్ లాల్ బీడీ కంపెనీ 0యాజమాన్యం కార్మికులపై వివక్ష చూపుతుందన్నారు. కార్మికులకు సరిపడా పని దినాలను, నాణ్యమైన తునికాకు, ధారం ఇవ్వడంలేదని...