- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతునేస్తం పై వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఇందల్వాయి రైతు వేదికలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో “వ్యవసాయం దండుగ కాదు పండుగ” చేయాలన్న ఆలోచన మేరకు ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ నాయకత్వంలో నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతునేస్తం పథకాన్ని రైతుల ఖాతాలలో రికార్డు స్థాయిలో 9 రోజుల్లో పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అబివృద్ధి అంటేనే ఇందిరమ్మ రాజ్యమన్నారు.రానున్న రోజులలో రైతులకు అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లు పాలించినప్పటికీ రైతుల పట్ల చిన్నచూపు చూసిందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానకే దక్కిందన్నారు.ప్రపంచం సైతం నేడు తెలంగాణ వైపు చూసేలా అబివృద్ధి జరుగుతుందన్నారు. నేడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో మండల కేంద్రాల్లో మరియు వివిధ క్లస్టర్లలో ఉన్న రైతువేదికల ద్వారా “రైతు నేస్తం” కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.రైతు భరోసా విడుదలకు తొలిరోజున ఏవిధంగా రైతు వేదికల ద్వారా లక్షలాది రైతుల సమక్షంలో కార్యక్రమాలు జరిపినట్టుగానే చివరి చెల్లింపు జరగడంతో రైతులలో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్,పీఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోపీ,గ్రామ శాఖఅధ్యక్షులు ఈర్ల సహెంధర్,నాయకులు మాజీ వైస్ ఎంపిపి ముత్తన్న,కడారి, వీరయ్య,కేపీ గంగారం,ఎంపిడిఓ అనంతరావు,తహశీల్దార్,వెంకట్రావు, ఏవో శ్రీకాంత్,ఏఇవో ప్రకాష్ గౌడ్, పంచాయితీ కార్యదర్శి భరత్,అన్నిగ్రామాల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
