అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతునేస్తం పై వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఇందల్వాయి రైతు వేదికలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో "వ్యవసాయం దండుగ కాదు పండుగ" చేయాలన్న ఆలోచన మేరకు ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ నాయకత్వంలో నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతునేస్తం పథకాన్ని రైతుల ఖాతాలలో రికార్డు స్థాయిలో 9...