27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మేధావులు, విద్యావేత్తలకు అవకాశం ఇస్తే అభివృద్ధి

Must read

📰 Generate e-Paper Clip

. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మేధావులు, విద్యావేత్తలకు రాజకీయాల్లోచదువుకున్న అవకాశం కల్పిస్తే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల బలం, గళం వినిపించేందుకు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించి సమాజ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. ముఖ్యంగా విద్యారంగ సమస్యలుపరిష్కరించడంలోతనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

More articles

Latest article