24.8 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెంటనే తెలియజేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : రూప్ టాప్ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తదితర అన్ని ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెంటనే తెలియజేయాలని విద్యుత్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో  విద్యుత్, రెడ్కో శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి  మాట్లాడుతూ   ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,  విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలు, ఆస్పత్రులు, అంగన్వాడీ భవనాలపై  రూప్ టాప్ సోలార్ సిస్టం ద్వారా విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లాలో గల ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,  విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలు, ఆస్పత్రులు, అంగన్వాడీలను మండల స్థాయిలో ఎంపీడీవో, విద్యుత్ శాఖ ఏఈలు  మండలంలో గల అన్ని ప్రభుత్వ ఆస్తులను సందర్శించి ఆయా సంస్థల భవనాలపై ఎండ పడే ప్రాంతాలను  జాగ్రత్తగా కొలిచి వాటి వివరాలను సేకరించాలని, అదేవిధంగా ఆయా కార్యాలయాలు సంస్థలలో  విద్యుత్ వినియోగం వివరాలను  సేకరించి త్వరగా అందించాలని విద్యుత్ ఎస్ఈ శివకుమార్ ను ఆదేశించారు.

More articles

Latest article