30.2 C
Hyderabad

చౌట్ పల్లి  పీహెచ్ సీ నుంచి ఉన్న డిప్యూటేషన్లను రద్దు చేయాలి

Deputations from the Choutpalli PHC should be cancelled.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

 

. . .  డీఎంహెచ్ఓకు ఆదేశించిన కలెక్టర్  

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా శివారులోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీఎంహెచ్ వో రాజశ్రీని ఆదేశించారు. శనివారం కమ్మర్పల్లి మండలం చౌట్ పల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, పీ.హెచ్.సీ నిర్వహణ తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. స్టాఫ్ నర్సు, స్వీపర్ మినహా ఇతర వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ వారి గురించి ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్, మరికొందరు సిబ్బంది డిప్యూటేషన్ పై ఇతర చోట్ల పని చేస్తున్నారని చెప్పడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ కి ఫోన్ చేసి రౌండ్ ది క్లాక్ పీ.హెచ్.సీలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే డిప్యూటేషన్ లను రద్దు చేయాలని ఆదేశించారు.

Deputations from the Choutpalli PHC should be cancelled.

పీ.హెచ్.సీ లోని  రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్,, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్, వ్యాక్సినేషన్ గది తదితర విభాగాలను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. మందులను నిల్వ ఉంచే డ్రగ్ స్టోర్ రూం అస్తవ్యస్తంగా ఉండడం పట్ల స్టాఫ్ నర్సును మందలించారు. మధుమేహం, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి స్టాఫ్ నర్సును ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టారు. కొన్ని రకాల ఔషధాల కాల పరిమితి ముగియనున్నట్లు గమనించిన కలెక్టర్, తక్షణమే ఇండెంట్ పంపించి అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. శీతలీకరణలో ఉంచాల్సిన ఔషధాలను ఫ్రిడ్జ్ లలోనే భద్రపరచాలని అన్నారు. గర్భిణీలకు ఏ.ఎన్.సీ చెకప్ లు క్రమం తప్పకుండా నిర్వహించాలని, హై రిస్క్ కేసులను ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేయాలని, ఈ.డీ.డీ క్యాలెండర్ ను పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని సూచించారు. తాను మళ్లీ ఆకస్మిక తనిఖీకి వస్తానని, పరిస్థితిలో మార్పు కనిపించకపోతే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు.

Deputations from the Choutpalli PHC should be cancelled.

More articles

Latest article