27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డిప్యూటేషన్లు క్యాన్సిల్…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సొంత స్కూళ్లలో రిపోర్టింగ్ చేయాలని విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలు

 

. . . మూడు సంవత్సరాలుగా కమిషనర్ ఆదేశాలు బేఖాతరు

 

. . . జీతాలు రాకపోయినా  ఎమ్మార్సీ  సీఅర్సీ  పట్టించుకోని తాత్కాలిక ఉద్యోగులు

 

. . . విద్యాశాఖలో ప్రతి ఏటా ఇదే తంతు

 

నిజామాబాద్, బతుకమ్మ 

 

ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే డిప్యూటేషన్లను రద్దు చేయడం విద్యాశాఖ సంచాలకులు చేస్తున్న పని.. కానీ డిప్యూటేషన్ పై ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది వాటిని బేఖాతార్ చేస్తున్నారు. 2025 -26  సంవత్సరం సంబంధించి గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో జరిగిన డిప్యూటేషన్లను, జిల్లా కలెక్టర్ ల కు నోట్ పైల్ ద్వారా చాలామంది ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట  తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. వాటిలో ఆన్ డ్యూటీ సౌకర్యం పై ఉన్న ఉపాధ్యాయులు మినహా మిగిలిన తాత్కాలిక సర్దుబాటు డిప్యూటేషన్లను రద్దయ్యాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈనెల  23 న ఉత్తర్వులు జారీ చేశారు. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా కొనసాగుతున్న వారిని ఈనెల 21న ఆదేశాలు జారీ అయ్యాయి…

పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలు ప్రతి ఏడాది బేఖాతరు అవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల లీడర్ల ప్రాపకంతో, పొలిటికల్ లీడర్ల అండతో తాత్కాలిక సర్దుబాటు పేరిట డిప్యూటేషన్ పై వచ్చిన వారు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జారీచేసిన రద్దు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24న తమ సొంత పాఠశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 2026 27 విద్యా సంవత్సరం ప్రారంభం రోజు వారికి డిప్యూటేషన్లు అవసరం ఉంటే వేస్తారు. దానితోపాటు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అవసరాల మేరకు నియామకం చేయబడతారు. ఉపాధ్యాయులు తమ సొంత పాఠశాలలో రిపోర్టింగ్ చేస్తేనే వారికి వేసవి సంబంధించిన వేతనాలు సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ద్వారా చేయాల్సి ఉంటుంది. పార్ట్ టైం ఇన్స్పెక్టర్లకు వేసవిలో సెలవుల కాలంలో ఎలాంటి వేతనాలు ఉండకుండా వారిని తొలగింపు మళ్లీ నియామకం పద్ధతిలో చేర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ 2023 నుంచి చాలామంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై వెళ్లి ఉత్తర్వులు రద్దయిన సొంత పాఠశాలలు రిపోర్టింగ్ చేయడం లేదు. ఎం ఆర్ సి ల పరిధిలో పనిచేసే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల దారిలోని సొంత పాఠశాలలకు వెళ్లి రిపోర్ట్ చేయకపోవడం గమనార్హం..

 

Deputations cancelled...

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 200 మందికి పైచిలుగా ఉపాధ్యాయులు డిప్యూటేషన్ లపై ఉన్నట్టు తెలిసింది. వారిలో చాలామంది సంవత్సరాలుగా డిప్యూటేషన్ లో పేర్ల మీదనే కాలం వెళ్లదీస్తున్నారు. కొందరైతే హైదరాబాదు నుంచి రాకపోకలు చేస్తున్నవారు ఉండగా.. నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లాకు వెళ్లి పనిచేస్తున్న వారు కూడా తాత్కాలిక సర్దుబాటు పేరిట సరిహద్దు మండలాల్లో పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల లీడర్లుగా చలామణి అవుతున్న వారి డిప్యూటేషన్లలో ఉండడం కోసమేరుపు. తమ యూనియన్ సభ్యుడని డిప్యూటేషన్లు కావాలని పైరవీలు చేయడం కూడా వారికే చెల్లింది. ఇదిలా ఉండగా డిప్యుటేషన్లు రద్దయి సొంత పాఠశాలలు రిపోర్టింగ్ చేయాల్సిన ఉపాధ్యాయులు అది చేయకపోయినా స్కూల్ కాంప్లెక్స్ ల నుంచి ఎం ఆర్ సి ల వరకు వారికి వేతనాలను రూపొందించడంపై పలు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. అధికారులే డిప్యూటేషన్ రద్దు అయిన వాటిని పట్టించుకోకుండా వారు రిపోర్టింగ్ చేయకపోయినా వేతనాలు వేయడం ఏమిటనే చర్చ జరుగుతుంది.. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కూడా విద్యాశాఖ అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. కొందరు మూడేళ్లకు పైగా డిప్యూటేషన్ లపై పని చేస్తుండడం విశేషం.. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.

More articles

Latest article