దంత పరీక్షలు, నోటి పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లు

0 8,871

 

. . . తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి టి.యాదగిరి రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దంత పరీక్షలు రెగ్యూలర్ గా చేయించుకుంటు, నోటి ని పరిశుభ్రంగా ఉంచుకోవటమే ఆరోగ్యకరమైన అలవాట్లని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఎన్‌ఎస్‌ఎస్ సెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గురువారం ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ & ఎడ్యుకేషన్ క్యాంప్ నిర్వహించారు. నోటి ఆరోగ్య సమస్యల గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉపకులపతి టి. యాదగిరిరావు హాజరయ్యారు. విద్యార్థులు, అధ్యాపకులు, సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.