27.2 C
Hyderabad

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు

I will not be contesting in the upcoming elections

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వయసు అయిపోతుంది

 

. .  . ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

పెద్ద మనిషిగా చెపుతున్న.. ఏళ్ళు గడిసి పోతున్నాయి.. అర్ధం అయిందా…వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు..అయినా మీకోసం తిరుగుతున్న అని బోధన్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, పీసీసీ కోశాధికారి పి. సుదర్శన్ రెడ్డి చేయూత పెన్షన్ ల పంపిణీ సందర్బంగ బోధన్ నియోజకవర్గం లో చేసిన వ్యాఖ్యాలు కలకలం రేపింది. బోధన్ ఏమ్మెల్యే చేసిన వాఖ్యలు అటు రాష్ట్ర రాజకీయాలు ఇటు జిల్లా పాలిటిక్స్ లో చర్చకు దారి తీసాయి.

మంత్రివర్గం లో  చోటు దక్కక ఒకప్పుడు నైరాష్యం లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారనే టాక్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లో తొలి విడత నుంచి ఉమ్మడి జిల్లా నుంచి సుదర్శన్ రెడ్ది పేరు వినిపించింది. కానీ సామాజిక సమీకరణలో మంత్రి వర్గం లో మొదటి, రెండు విడతల్లో చోటు దక్కలేదు. తోలుతా స్పీకర్ పదవి ఆఫర్ చేసిన ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు.రాష్ట్రం లో హోంమంత్రి పదవి భర్తీ చేయకపోవడం తో అపొస్ట్ ను సుదర్శన్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి దక్కింది.

సుదర్శన్ రెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిక్కు. అయిదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రం లో భారీ నీటి పారుదల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవులను నిర్వహించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో  బోధన్ నియోజకవర్గం లో ప్రచారం సమయం లోను సుదర్శన్ రెడ్డి తనకు చివరి ఎన్నికలు అన్నారు. అప్పుడే జిల్లా లో సుదర్శన్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు అని చర్చ మొదలు అయింది. ఇప్పటికి రాష్ట్రం లో కొందరు మంత్రులు, సీనియర్ నాయకులు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అనే వాక్యాలు తరచు వినపడుతున్నాయి. కానీ జిల్లాలో, బోధన్ నియోజకవర్గం లో పిఎస్ఆర్ వారసులు ఎవరనే టాక్ మొదలయింది.

More articles

Latest article